Posts

Showing posts from April, 2020

Press Release

పత్రిక ప్రకటన ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వలస కూలీలు, తెలంగాణ రాష్ట్రం లో ఉన్న ఇతర రాష్ట్ర కూలీలకు సంబంధించిన వివరాలకు ఢిల్లీ తెలంగాణ భవన్ లో కవిడ్-19 కంట్రోల్ రూమ్ ఏర్పటు చేయడం జరిగిందని రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ వలస కూలీలకు మౌలిక వసతులు, భోజనం ఏర్పాటు చేసేందుకు అభ్యర్థనల బట్టి సంబంధిత రాష్ట్ర జిల్లా అధికారులతో మాట్లాడడం జరుగుతుందన్నారు. ఈ కంట్రోల్ రూమ్ నుండి రాష్ట్రం లేదా రాష్ట్రాల నుండి వచ్చిన అభ్యర్థనాలను  వివిధ రాష్ట్రాల నోడల్ అధికారుల తో లేదా తెలంగాణ లో ని జిల్లా , రాష్ట్ర నోడల్ అధికారులతో సమన్వయం చేయడం జరుగుతుందని తెలిపారు. అంతే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన వైద్య పరికరాల రవాణ ని రెసిడెంట్ కమీషనర్ కార్యాలయం సమన్వయం చేస్తుందన్నారు. ఇందులో 25000 మస్కులు, 2000 పి పీ ఈ లు , 10000 సనిటీజర్లు, 6250 గగుల్స్, కావేర్ఆల్ 7200, 3,50,000 హెచ్. సి. క్యూ (HCQ) మందులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ కంట్రోల్ రూమ్ నెంబర్. 011-23380556