Telugu states in New Delhi towards COVID-19 prevention precautions

పత్రికా ప్రకటన తేదీ : 18-03-2020 కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒకరు తమ వంతుగా జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర రెసిడెంట్ కమీషనర్ డా . గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఢిల్లీ లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర భవనం లో విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బంది తో పరస్పర సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తీసుకుంటున్నా చర్యలు, వ్యాధి పట్ల ఉన్న అపోహల పై చర్చించారు. వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా దగ్గు, జలుబు ఉన్న వారు తప్పని సరిగా మాస్క్ ధరించాలి, సాధారణ జ్వరం ఉన్న, తప్పకుండా భవన్ డాక్టర్లును సంప్రదించాలని సూచించారు. చేతులు శుభ్రం లేకుండా ముఖం మీద చేతులు పెట్టడం నివారించాలి, చేతులు 20 సెకండ్ల పాటు సబ్బు లేదా హ్యాండ్ వాష్ తో తరచు శుభ్రపరుచుకోవాలి. వీలైనంత వరకు సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే డాక్టర్ ను సంపాదించాలని తెలిపారు. రిసెప్షన్, ఎంట్రీ గేట్, కాంటీన్, షాపులు , బ్యాంక్ , ఏ టి ఏం, మీడియా సెంటర్ లో శానిటైజర్ అందుబాటులో ఉంచాలని, భవన్ లోని...