Floral tributes to Prof. K.Jayashankar in New Delhi
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhbFIs3ZfogaNLv-Su04GQYk7f_6sorer_wxMjd88AynCODe4lijI7Ers0iKlnimV2js38GUa2ZVKPoXn8Ldsa9h6RXz4RhxvrHs7MOHRUPYtexhGsnK3utx7OZ1LrC4EJfOGsLdP39hj6E/s640/IMG-20200806-WA0006.jpg)
తేదీ: 06-08-2020 ఢిల్లీ ఆచార్య జయశంకర్ 86 వ జయంతి సందర్భంగా పార్లమెంట్ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ , ప్రత్యేక ప్రతినిధి సహానీ, రెసిడెంట్ కమీషనర్ డా . గౌరవ్ ఉప్పల్ తో కలసి న్యూ ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో ఆచార్య జయశంకర్వారి చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత సమస్యల మీద ఉద్యమానికి నాయకుడు కావాలని కేసీఆర్ లాంటి వ్యక్తి తోనే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అయన భావించారు. నూతన రాష్ట్ర ఏర్పాటు నుండి నేటి వరకు ప్రొఫెసర్ గారి ఆశయ సాధన కోసం వివిధ పథకాలన్ని, అన్ని రంగాల ప్రజలకు చేయూత అందించే విధంగా ప్రవేశ పెట్టారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు, వికలాంగులకు, రైతులకు అందిస్తున్న పధకాలు జాతీయ , అంతర్జాతీయ ప్రశంసలను అందుకున్నాయి. నిన్న జరిగిన కాబినెట్ లో తీసుకున్నా నిర్ణయం ద్వారా స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రో. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం గారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపారన్నారు. అభివృద్ధి , సంక...