Floral tributes to Prof. K.Jayashankar in New Delhi



     తేదీ: 06-08-2020
ఢిల్లీ
  ఆచార్య జయశంకర్ 86 వ జయంతి సందర్భంగా పార్లమెంట్ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ , ప్రత్యేక ప్రతినిధి సహానీ, రెసిడెంట్ కమీషనర్ డా . గౌరవ్ ఉప్పల్ తో కలసి న్యూ ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో  ఆచార్య జయశంకర్వారి  చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్  మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత సమస్యల మీద ఉద్యమానికి నాయకుడు కావాలని కేసీఆర్ లాంటి వ్యక్తి తోనే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అయన భావించారు. నూతన రాష్ట్ర ఏర్పాటు నుండి నేటి వరకు ప్రొఫెసర్ గారి ఆశయ సాధన కోసం వివిధ పథకాలన్ని, అన్ని రంగాల ప్రజలకు చేయూత అందించే విధంగా  ప్రవేశ పెట్టారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు, వికలాంగులకు, రైతులకు అందిస్తున్న పధకాలు జాతీయ , అంతర్జాతీయ ప్రశంసలను అందుకున్నాయి. నిన్న జరిగిన కాబినెట్ లో తీసుకున్నా నిర్ణయం ద్వారా స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రో. జయశంకర్  ఆశయాలకు అనుగుణంగా సీఎం  గారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపారన్నారు. అభివృద్ధి , సంక్షేమం తో పాటు మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తున్నారన్నారు.
తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి శ్రీ కె ఏం సహానీ మాట్లాడుతూ ... ప్రొఫెసర్ జయశంకర్ తో ఉన్న పరిచయం గురించి వివరించారు. అప్పట్లో ప్రొఫెసర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్న గౌరవ ముఖ్య మంత్రి ని కలవడానికి వచ్చినపుడు ఉమ్మడి రాష్ట్రం లో ఉన్న తెలంగాణ రైతుల సమస్యల పై చర్చించేవారు.  ప్రొఫెసర్ జయశంకర్ గారు వ్యవసాయ నిపుణులు గా పరిచయం అయ్యారు, ఒక వైపు ఉద్యమం స్ఫూర్తి తో మరో వైపు వ్యవసాయ రంగం లో అభివృద్ధి కి కృషి చేసేవారు.  
తెలంగాణ భావన్ రెసిడెంట్ కమీషనర్ డా. గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ ఉద్యమం కోసం ప్రొఫెసర్ చేసిన కృషిని, త్యాగాలని గుర్తుచేశారు. అంతే కాకుండా అయన వ్యవసాయ రంగానికి అందించిన నైపుణ్యం మరువలేనిదన్నారు.  
ఈ కార్యక్రమం లో భావన్  అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

Floral tributes to Sri Kaloji on his 106 jayanthi in New Delhi

Minister for ST Welfare, Woman and Child Welfare, Telangana State called on Union Ministers