Telugu states in New Delhi towards COVID-19 prevention precautions

పత్రికా ప్రకటన      తేదీ : 18-03-2020
కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒకరు తమ వంతుగా జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర రెసిడెంట్ కమీషనర్ డా . గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఢిల్లీ లోని  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర భవనం లో విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బంది తో పరస్పర సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తీసుకుంటున్నా చర్యలు, వ్యాధి పట్ల ఉన్న అపోహల పై చర్చించారు. వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా దగ్గు, జలుబు ఉన్న వారు తప్పని సరిగా మాస్క్ ధరించాలి, సాధారణ జ్వరం ఉన్న, తప్పకుండా భవన్ డాక్టర్లును సంప్రదించాలని సూచించారు. చేతులు  శుభ్రం లేకుండా  ముఖం మీద చేతులు పెట్టడం నివారించాలి, చేతులు 20 సెకండ్ల పాటు సబ్బు లేదా హ్యాండ్ వాష్ తో తరచు శుభ్రపరుచుకోవాలి. వీలైనంత వరకు సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే డాక్టర్ ను సంపాదించాలని తెలిపారు. రిసెప్షన్, ఎంట్రీ గేట్, కాంటీన్, షాపులు , బ్యాంక్ , ఏ టి ఏం, మీడియా సెంటర్ లో శానిటైజర్ అందుబాటులో ఉంచాలని, భవన్ లోని అన్ని గదులు, లిఫ్ట్, రైలింగ్ తరచు సుబ్రాభ్రం చేయాలనీ అధికారులను ఆదేశించారు.  అనంతరం డాక్టర్లు వివిధ జాగ్రత్తల పై వివరించారు.అదనపు రెసిడెంట్ కమీషనర్ శ్రీ వేదంతం గిరి మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది  వారి వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ వ్యాధి, ముందు జాగ్రత్తల పట్ల అవగాహనా కలిపించాలని అయన తెలిపారు. ఈ సమావేశం లో తెలుగు రాష్ట్రాల డాక్టర్లు బిందు అశోక్ కుమార్, రామ దేవి, తెలంగాణ డిప్యూటీ కమీషనర్ & నోడల్ అధికారి శ్రీ రామ్ మోహన్, ఆంధ్ర ప్రదేశ్ అసిస్టెంట్ కమీషనర్ & నోడల్ అధికారి శ్రీ రామా రావు, లైజాన్ అధికారి శ్రీ దేవేందర్   భవన్ పరిధి లో ని అన్ని విభాగాలలో విధులు నిర్వహిస్తున్న అధికారులు,  సిబ్బంది, భద్రత సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

Ms. Padma, Inspector of Police is at UN PeaceKeeping Mission in South Sudan

Independence Day celebrations