Sri Jagadish Reddy called on Union Minister
Press Release Date : 03-12-2019
తేదీ : 03.13.2019,
న్యూఢిల్లీ.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన మంత్రి జగదీశ్ రెడ్డి, రాజ్యసభ ఎం.పి. బడుగుల లింగయ్య యాదయ్య, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గొంగిడి సునీత..
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల అంశాలపై చర్చ..
జగదీశ్ రెడ్డి, మంత్రి..
ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అందజేసాం..
గతంలో తెలంగాణ రాష్ర్టానికి జాతీయ రహదారుల కేటాయింపు అంశంలో అన్యాయం జరిగింది.
ఇదే అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు..
3, 150 కిలో మీటర్ల జాతీయ రహదారులు కేటాయిస్తామని ప్రధాని మోదీ మాట ఇచ్చారు..
అందులో 600 కిలో మీటర్లకు పైనా నంబరింగ్ ఇవ్వలేదు..
నంబరింగ్ ఇచ్చిన రహదారుల పనులు కూడా ప్రారంభించ లేదు..
కొత్త వాటికి నంబరింగ్ ఇచ్చి పనులు వేగవంతం చేయాలని కోరినం..
వర్షాల వల్ల రాష్ర్టం లోని జాతీయ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి.
వాటన్నింటిని త్వరగా రిపేర్లు చేయాలని కోరినం..
హైదరాబాద్ నుండి భూపాలపల్లి 163 జాతీయ రహదారిలో రెండు చోట్ల అండర్ పాస్ లు మంజూరు చేయాలని కోరినం..
కోదాడ-మిర్యాలగూడ జాతీయ రహదారి 167లో మరి కొన్ని ప్రాంతాల్లో కూడా అండర్ పాస్ లు నిర్మాణం చేయాలని కోరినం..
చేవేళ్ల-బీజాపూర్ జాతీయ రహదారి అంశాన్ని వేగవంతం చేయాలని కోరినం..
హైదరాబాద్ చుట్టు రిజనల్ రింగ్ రోడ్డు అంశాన్ని త్వరగా చేపట్టాలని కోరినం..
అన్ని అంశాల పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.
నామా నాగేశ్వర్ రావు, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత..
గతంలో హామీ ఇచ్చిన జాతీయ రహదారుల నిర్మాణ అంశం పెండింగ్ లో ఉంది..
రిజనల్ రింగ్ రోడ్డు అంశంలో రాష్ర్ట ప్రభుత్వం తరుపున 50శాతం భరిస్తామని చెప్పినం..
ఇందుకు నంబరింగ్ ఇచ్చి పనులు వేగవంతం చేయాలని కోరినం..
బాల్క సుమన్, ఎమ్మెల్యే..
చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వెళ్లే 63జాతీయ రహదారి వెళ్తోంది..
ఇందులో మూడు చోట్ల ఫ్లై ఓవర్లు, జంక్షన్లను అభివృద్ధి చేయాలని కోరినం..
కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు..
Comments
Post a Comment